ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజా సమస్యలపై చింత లేని చంద్రబాబు–పవన్ డ్రామాలు కట్టి పెట్టాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట : రుషికొండపై కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలు అసత్యం, మాయ మాటలు తప్ప మరేమీ కావు. చంద్రబాబు, పవన్, లోకేష్‌లకు ప్రజా సమస్యలపై చింత లేదు.. కెమెరా ఫోకస్ దొరకే చోట డ్రామా చేస్తే చాలు అని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ రోజు ప్రభుత్వ జీవోలో స్పష్టంగా రుషికొండను పర్యాటక రిసార్ట్‌గా పేర్కొన్నారు. అప్పుడు జగన్ ప్యాలెస్ అని ఎందుకు రాయలేదు? కూటమి నేతలు ఎక్కడైనా ఖాళీ గోడలు కనపడితే అక్క‌డే నాటకాలు ఆడుతున్నారు. రుషికొండ దగ్గర ఫోటో షూట్లతోనే రాజకీయాలు నడిపిస్తే ప్రజలు నమ్ముతారని అనుకోవడం వేషాల రాజకీయాలు తప్ప ఇంకేమీ కాదు అని ఎద్దేవా చేశారు.

స్టీల్ ప్లాంట్ అంశంపై ధర్మాన తీవ్రంగా విరుచుకుపడుతూ.. వేలాది కార్మికులు వీధులపైకి రోడ్డెక్కినా చంద్రబాబు, పవన్ నోరు విప్పలేదు. ఒకవైపు ‘విశాఖ ఉక్కు నా ఆత్మ’ అని చెబుతారు, మరోవైపు కేంద్రం అమ్మకానికి పెట్టినా ఒక్క అడుగు ముందుకు వేయలేని చేతగాని నేతలే వారన్నారు. మొదటి రోజు నుంచి మాది ఒకే వైఖరి.. ప్రైవేటీకరణకు గట్టి వ్యతిరేకత. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే స్థానం. అసెంబ్లీలో తీర్మానం చేసి నిరూపించాం. జగన్ వల్లే ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర మంత్రే బహిరంగంగా చెప్పారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా చంద్రబాబు, పవన్‌కి నోరు తెరవడానికి సిగ్గు లేదా?" అని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం తలమునకలై ఉంది. కానీ కూటమి నేతలకు మాత్రం ఫోటోలు, పబ్లిసిటీ తప్ప ఇంకేదీ కనబడటం లేదు అని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు.

Post a Comment

0 Comments