ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

DLDA చైర్మన్ గా నక్క తులసిదాస్

సారవకోట: DLDA చైర్మన్ కు సంబంధిత అధికారులు ఎట్టకేలకు ఈ నెల 26న ఉత్తర్వులు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. గత ప్రభుత్వ హయాంలో సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన నక్క తులసీదాసు జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ (DLDA) చైర్మన్ కు 2023 డిసెంబర్ 4న ఏకగ్రీవంగా ఏజెన్సీ సభ్యులు ఎన్నుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొందరు DLDA చైర్మన్ లు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. అయినప్పటికీ మన జిల్లాలో కూటమి ప్రభుత్వ పెద్దలు అడ్డుపడటంతో సంబంధిత శాఖాధికారులు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎట్టకేలకు కలెక్టర్ సూచనల మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు అందజేశారు. గురువారం YSRCP జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా మబగాం లో ప్రొసీడింగ్ పత్రాలను తులసీదాస్ అందుకున్నారు.

Post a Comment

0 Comments