నీరు బయటకు వెళ్లే మార్గాల్లో పూడిక తొలగించాలని నగరం పాలక సంస్థ అధికారులకు ఆదేశం.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు రహదారులు, ప్రధాన కూడళ్లల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు. దీనితో నగర పాలక సంస్ధ సహాయక కమీషనర్‌ను ప్రజాసదన్‌కు పిలిపించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు. తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారిపై
ఈనాడు ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోవడానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు.
కాలువల్లో నెలల తరబడి పూడిక తీతలు చేపట్టక పోవడం వలనే ఈ పరిస్థి ఏర్పడిందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
తక్షణమే కాలువల్లో పూడిక పోయిన చెత్తను తొలగించి ప్రజలకు వరద నీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రధాన డ్రైనేజీ వ్యవస్ధపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎక్కడికి అక్కడ అత్యవసర చర్యలు చేపట్టాల్నారు.ఆయనతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హజరై జాతీయ రహదారి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి జాతీయ రహదారిపై నీరు పెద్ద ఎత్తున నిలిచిపోవడానికి గల కారణాలు గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.
0 Comments