శ్రీకాకుళం, ఆగస్టు 26: శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఐదుగురు రికార్డు సహాయకులు జూనియర్ సహాయకులుగా పదోన్నతి పొందారు. మంగళవారం ఉదయం జిల్లా ప్రజా పరిషత్ అధికారిక వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఉత్తర్వులను అందజేశారు. మురపాక పాఠశాలలో పనిచేస్తున్న డి. రమాదేవి, లింగలవలస పాఠశాలలోని కె. హేమలత, గోవిందపురం పాఠశాలలోని పి. జయలక్ష్మి, బోరుభద్ర పాఠశాలలోని ఎ. గోపాలరెడ్డి, ఫరీదుపేట పాఠశాలలోని కె. పద్మలత పదోన్నతులు పొందారు. వీరిని వరుసగా వొంకులూరు, అమలపాడు, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పాతపట్నం ప్రాంతాల్లోని పాఠశాలలు, కార్యాలయాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ సందర్భంగా పిరియా విజయ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు తమ కొత్త బాధ్యతల్లో నిబద్ధతతో పని చేసి జిల్లా ప్రజా పరిషత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్.ఎన్.వి. శ్రీధర్ రాజ, డిప్యూటీ సీఈఓ డి. సత్యనారాయణ, సి సెక్షన్ సిబ్బంది, పదోన్నతి పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
0 Comments