ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కార్యకర్తలతో కృష్ణచైతన్య.

నరసన్నపేట వైసిపి కార్యాలయంలో కార్యకర్తలతో కృష్ణ చైతన్య పోస్టర్ ను నియోజకవర్గ వైసిపి నేతలు ఆవిష్కరించారు..
- యువ నాయకులు వైసిపి నియోజకవర్గ ఆశాజ్యోతి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య కార్యకర్తల చెంతకు వెళ్ళనున్నారు.
- నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్ గ్రామాన్ని సందర్శించి కార్యకర్తల ప్రజల కష్టసుఖాలు తెలుసుకోనున్నారు.
- కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలకు జరిగిన నష్టాలను తెలుసుకొని డిజిటల్ బుక్ లో నమోదు చేస్తారు.
- నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.

*కార్యకర్తలతో కృష్ణచైతన్య…* 

*గ్రామ స్థాయి నాయకులు యువజన , రైతు , మహిళా , బీసీ , ఎస్సి, సోషల్ మీడియా కమిటీల సభ్యులతో కలసి కష్టసుఖాలు పంచుకుంటూ, సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలను చర్చించనున్నారు.*

*ఈ వినూత్న కార్యక్రమం 70 క్లస్టర్లలో 36 రోజుల పాటు కొనసాగనుంది.*
 *ఈ సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ మాట్లాడుతూ కార్యకర్తలతో నేరుగా చర్చలు జరపడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుంది.*
* *యువ నాయకుడు కృష్ణచైతన్య తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలకు కొత్త ఉత్సాహం, నమ్మకం కలుగుతుందని తెలిపారు* 

ఈ కార్యక్రమం లో ఎంపీపీలు వాన గోపి ,ముద్దాడ బైరాగి నాయుడు , జెడ్పీటీసీ చింతు రామారావు , DLDA చైర్మన్ నక్క తులసి దాస్ ,రాష్ట్ర పొందర కూరకుల విభాగం అధ్యక్షులు రాజపు అప్పన్న , జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు K Ch గుప్తా , నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గురుగుబెల్లి వెంకట రమణి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దండి జయప్రకాష్ , నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్ ,నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు సురంగి నర్సింగరావు , నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు మడ్డు కృష్ణారావు , మండల అధ్యక్షులు కణితి కృష్ణారావు , కనుసు సీతారాం , లుకలాపు రవి , జిల్లా కార్యదర్శి మెజ్జాడ శ్యామలరావు , మండల యూత్ అధ్యక్షులు బుద్దల రాజశేఖర్ , జిల్లా యూత్ కార్యదర్శి పాగోటి గోవింద, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి కనపల అరవింద్ , మండల బూత్ కమిటీ అధ్యక్షులు బబ్బొది ఈశ్వరరావు , సర్పంచ్లు బురల్లి శంకర్ యాబాజీ రమేష్, అల్లు ఆశిరినాయుడు , ఎంపిటిసి సురవరపు పాపినాయుడు , పతివాడ గిరీశ్వరం , బార్ల వేణు ,వార్డు సభ్యులు రఘు పాత్రుని బుజ్జి , తోట భార్గవ్ తదితరులు పాల్గొన్నారు...

Post a Comment

0 Comments