గ్రామ సేవ- రామసేవ లక్ష్యంగా సమాజ సేవ చేయాలని నాయుడు గారి ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రధానర్చకులు నాయుడు గారి రాజశేఖర్ తెలిపారు. శనివారం జలుమూరు మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో తమ తాత గారైన నాయుడు గారి రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం 25 మంది పేదలకు, వృద్ధులకు అనాధలకు చీరలు ,దుప్పట్లు, రేషన్ కిట్ లు, పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు తమకు తోచిన సహాయాన్ని పేదలకు, వృద్ధులకు, అనాధలకు చేయాలని కోరారు. తద్వారా మంచి సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ఇతరులకు సేవ చేయడమే దైవత్వంగా భావించాలన్నారు. మానవసేవే మాధవ సేవ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు గారి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ శైలజ, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments