ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

9న అనకాపల్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: ధర్మాన కృష్ణ దాస్

నరసన్నపేట : అనకాపల్లి జిల్లా మార్కాపురంలో 9వ తేదీన జరిగే మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల ఆవేదన వ్యక్తమవుతుండగా, ప్రజా వైద్య సేవలను కాపాడాలనే నినాదంతో ఈ నెల 9న మార్కాపురం మండలంలోని భీమబోయినపాలెంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సందర్శన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. వైద్య రంగాన్ని ప్రజా సేవా దృక్పథంతో కొనసాగించాలన్న డిమాండ్‌తో జరగబోయే ఈ కార్యక్రమానికి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానుండగా, జిల్లా, నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై పర్యటనను ఘనవిజయం చేయాలని ధర్మాన కోరారు.

Post a Comment

0 Comments