👉ముఖ్య అతిథిగా హాజరైన యువ నాయకులు బగ్గు సునీల్
👉విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ ఆర్కిటెక్చర్ డబ్బీర్ కిషోర్ చంద్ర పట్నాయక్
👉హాజరైన జర్నలిస్టులు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయ కుటుంబ సభ్యులు
👉వైద్య శిబిరానికి ఆతిథ్యం ఇచ్చిన విజ్ఞాన విద్యా నికేతన్ పాఠశాల
నరసన్నపేట: మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన త్రిలోక గూడచారి పత్రిక ఎడిటర్ జయవర్ధన్ ఆధ్వర్యంలో నరసన్నపేట నియోజకవర్గం లో గల నాలుగు మండలాలు పోలాకి, నరసన్నపేట జలుమూరు, సారవకోట నుండి జర్నలిస్టులు నరసన్నపేట మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ కుటుంబ సభ్యులకు రాగోలు జెమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో నేతాజీ వీధిలో విజ్ఞాన విద్యానికేతన్ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ముందుగా అతిథులు బగ్గు సునీల్, డబ్బీరు కిషోర్ చంద్ర పట్నాయక్ లు పాఠశాల ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసన్నపేట నియోజకవర్గ టిడిపి యువ నాయకులు బగ్గు సునీల్ మాట్లాడుతూ జర్నలిస్టు కుటుంబ సభ్యులకు, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరం పెట్టడం గొప్ప విషయం అని తెలిపారు. వైద్య శిబిరంలో ఏర్పాటుచేసిన ఈసీజీ, టుడిఎకో, షుగరు, బిపి టెస్టులు ఎంతో ఖర్చుతో కూడుకున్నవని, వాటిని రాగోలు జెమ్స్ వారు ఉచితంగా అందించడంతో వారికి అభినందనలు తెలియజేశారు.
ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు జర్నలిస్టులు కష్టపడతారని, నేటి సమాజంలో నాయకులు,అధికారులు ను సామాజిక బాధ్యత కలిగిన వార్తలు రాయడం ద్వారా జాగృతం చేసిన వాళ్ళు అవుతారని తెలిపారు. విలువలు కలిగిన సమాజ నిర్మాణంలో జర్నలిస్టు పాత్ర ముందు ఉంటుందని తెలిపారు.
కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న డబ్బీర్ కిషోర్ చంద్ర పట్నాయక్ మాట్లాడుతూ మీడియా సమాజానికి నాలుగో పిల్లర్ గా పనిచేస్తుందని ఒక కలం కొన్ని వేల మంది జీవితాల్లో సంతోషం నింపుతుందని తెలిపారు. పాత్రికేయులు సామాజిక స్పృహతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తెలిపారు. రాజకీయ నాయకులకు అధికారులకు మీడియా ప్రతినిధులుగా వారధిగా పని చేస్తారని, మీడియా ప్రతినిధులు బాధ్యతతో విధులు నిర్వహిస్తారని వారు సేవలు వెలకట్టలేనివని తెలిపారు.
నరసన్నపేట ప్రెస్ క్లబ్ (APUWJ) అధ్యక్షులు తోట చంద్రమోహన్ దేవ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు మండలాల జర్నలిస్టు కుటుంబాలకు ప్రైవేటు టీచర్స్ కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం గా ఉందని తెలిపారు. పత్రికా రంగంలో ఎన్నో సంవత్సరాలగా పని చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ నిరంతర కార్మికుడిగా మీడియా ప్రతినిధులు పనిచేస్తారని తెలిపారు.
విజ్ఞాన విద్యానికేతన్ ప్రిన్సిపల్ బాడాన నారాయణరావు, విజ్ఞాన్ విద్యానికేతన్ డైరెక్టర్ కలివరపు రామకృష్ణ, రవీంద్ర భారతి ప్రిన్సిపల్ ధర్మాన వాసుదేవ్ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను ఎత్తి చూపించే మీడియా ప్రతినిధులు తాము చేపట్టిన ఉచిత వైద్య శిబిరంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ తో పాటు వారి కుటుంబ సభ్యులను భాగస్వామ్య చేయడం గొప్ప విషయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెమ్స్ హాస్పిటల్ డాక్టర్లు, టెక్నీసులతో పాటు ఏజీఎం నారాయణరావు, పారసిల్లి సర్పంచ్ డబ్బీరు.కిరణ్ పట్నాయక్ పి.ఆర్.ఓ శంకర్, బారికి గోపాలకృష్ణ, భాషా గణేష్, వైశ్య రాజు కేశవరాజు, లాడి కాశి, వివిధ పాఠశాలల ప్రిన్సిపల్లు రమేష్, అసిరి నాయుడు, వెలమల భాస్కరరావు మిగిలిన మండలాల జర్నలిస్టులు, మండలంలో ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
0 Comments