జలుమూరు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న టీడీపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. నరసన్నపేట నియోజకవర్గం, జలుమూరు మండలం కరవంజ , బసివాడ గ్రామంలో శనివారం జరిగిన 'రచ్చబండ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కోటి సంతకాల' సేకరణ కార్యక్రమం కూడా ఉధృతంగా జరిగింది.ప్రసంగంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం, పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే లక్ష్యంతో మా అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. పేదలకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో ప్రజల్లో చైతన్యం నింపాలని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పేదవారు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం, విద్యను అందుకున్నారు. ప్రజల గుండెల్లో జగన్ గారు పదిలంగా ఉన్నారు. ఆయన ప్రజా సంక్షేమ లక్ష్యానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న ప్రైవేటీకరణ నిర్ణయాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కరవంజ, పాగోడు, హుస్సేనుపురం, గుగ్గిలి క్లస్టర్ మరియు బసివాడ , టెక్కలిపాడు , రాయిపాడు పరిధిలోని గ్రామ కమిటీ సభ్యులతో జరిగిన ఈ రచ్చబండకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి , జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దామ మన్మధరావు, జిల్లా కార్యదర్శి మెజ్జాడ శ్యామలరావు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్ మోహన్, నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు కరవంజ కుర్మారావు , మండల యూత్ అధ్యక్షులు జుత్తు నేతాజీ మండల RTI విభాగం అధ్యక్షులు పొన్నాడ ముసలి నాయుడు , మండల ఎస్సి సెల్ అధ్యక్షులు నవిరి పోతయ్య, మండల సోషల్ మీడియా అధ్యక్షులు కర్రి అయ్యప్ప, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు దువ్వరపు ప్రసాద్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు బుద్దల శ్రీనివాస్ ,మండల పంచాయతీ రాజ్ అధ్యక్షులు బోర సింహాచలం , జిల్లా ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యులు ఉంకిల్ గోపాలకృష్ణ ,ఎంపిటిసిలు తర్ర జీవరత్నం, పాగోటి చందనబాబు, బెండి ఎర్రన్న , సర్పంచ్లు బలగ లక్ష్మి అర్జున్ ,ధర్మాన భువాజీ , ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments