ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కాశీబుగ్గ ఘటన నుంచి తప్పించుకునేందుకే జోగి రమేష్ అరెస్ట్


👉కూటమికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే..
 👉కాశీబుగ్గ ఘటన నుంచి తప్పించుకునేందుకే జోగి రమేష్ అరెస్ట్.
👉మాజీ మంత్రిని అక్రమంగా అరెస్టు చేయడంపై ధర్మాన కృష్ణ దాస్ గారు తీవ్ర ఆగ్రహం.

నరసన్నపేట: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపుతోందని, ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ గారిని అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ అరెస్టు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో, ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన తుఫాన్ విపత్తు నష్టంపై రైతులను ఆదుకోలేకపోవడం, ముఖ్యంగా కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఈ అరెస్టు జరిగిందని ధర్మాన కృష్ణ దాస్ గారు తేల్చి చెప్పారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవే చర్యలు నడుస్తున్నాయని ధర్మాన కృష్ణ దాస్ గారు విమర్శించారు. ఒకవైపు కల్తీ మద్యం తయారీలో కూటమి పార్టీ తరపున పోటీ చేసిన వ్యక్తితో పాటు ఆ పార్టీ నాయకులే నిందితులుగా ఉన్నా, వారిని అరెస్టు చేయకుండా, కేవలం తప్పుడు స్టేట్‌మెంట్‌ల ఆధారంగా ఒక మాజీ మంత్రి గారిని అరెస్టు చేయడం న్యాయం కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్ గారికి ప్రజల్లోకి వస్తున్న తరుణంలో, చంద్రబాబు గారి అబద్ధపు హామీల పట్ల ప్రజల్లో ఏర్పడిన మోసపు భావన నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ లిక్కర్ కేసుపై సీబీఐ విచారణకు సిద్ధపడాలన్న జోగి రమేష్ గారు సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాశీబుగ్గ తరహా ఘటనల్లో ధర్మకర్తలపై కేసులు పెడుతున్న పోలీసులు, తిరుమలలో భక్తులు చనిపోయినప్పుడు టీటీడీ చైర్మన్‌పై ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పెద్దలకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా? అని నిలదీసిన ధర్మాన కృష్ణ దాస్ ఈ అన్యాయాలపై ప్రజలు ఏకమై బుద్ధి చెప్పే సమయం వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Post a Comment

0 Comments