ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రశాంతతకు నిలయంగా పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి మండలంలోని, డోల,పోలాకి,వెదుళ్ళవలస గ్రామాల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకలలో భాగంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు రమణమూర్తి ముఖ్య అతిధిగా హాజరై,భగవాన్‌ సత్య సాయి బాబా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ…“భగవాన్ సత్యసాయి బాబా మానవతా సేవకు ప్రతీక. ఆయన బోధనలు సమాజాన్ని నడిపించే శక్తి కలిగినవి. ప్రేమ, సేవ, నమ్మకం అనే మూడు మూలసూత్రాలు ఆయన మనకు అందించిన అమూల్యమైన వరాలని, అనంతపురం కు మంచినీటి ఘనత బాబా కి దక్కుతుందన్నారు.నరసన్నపేట ప్రజలు కూడా ఈ బోధనలు అనుసరిస్తూ సమాజ సేవలో ముందుండాలి” అని ఎమ్మెల్యే తెలిపారు.అలాగే ఆయన శతజయంతి సంవత్సరాన్ని ప్రజలందరూ సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన,డోల జగన్ ,కార్పొరేషన్ చైర్మన్లు రోణంకి కృష్ణన్నాయుడు, దామోదర నర్సింహులు,మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు పోలాకి పిఎసిఎస్ చైర్మన్ భైరి భాస్కరరావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, తహశీల్దార్ గారు,ఎంపీడీవో సచివాలయం సిబ్బంది తదితరులు, సత్య సాయి భక్తులు , ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments