ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మనం చూసిన ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్

పోలాకి మండలం వెదుళ్ళవలస, పోలాకిలో ఆదివారం జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం.. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా మనము చూసిన, మన కాలంలో నడయాడిన ప్రత్యక్ష దైవము అని కొనియాడారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో ప్రేమ స్వరూపులుగా దైవ స్వరూపులుగా నిలిచిపోయారని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ అన్ని ప్రాంతాల్లో కొనసాగించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, పార్టీ అధ్యక్షులు కణితి క్రిష్ణారావు, యువజన విభాగం అధ్యక్షులు రెంటికోట త్రినాథరావు, ఎంపీటీసీ అశోక్ బాబు, సర్పంచ్ సనపల సోమేశ్వరరావు, వ్యాపార ధర్మారావు శ్రీ సత్యసాయి బాబా భక్త బృందం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments