ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. వైఎస్సార్ సీపీ కాళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళితో జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్

పార్టీ పదవులు, వివిధ కులాల విభాగాల అధ్యక్షులుగా నియమితులైన వారి అందరి ధ్యేయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టతే కావాలని, ఈ మేరకు సమన్వయంతో పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పార్టీ వారి సేవలను గుర్తించి వారికి సముచిత స్థానం ఇస్తున్నం దున సద్వినియోగం చేసుకొని పార్టీ నమ్మకాన్ని నిల బెట్టుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ కాళింగ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన ఆరంగి మురళీధర్ తన అనుచరులు, పార్టీ శ్రేణు లతో కలిసి ర్యాలీగా వచ్చి ఆదివారం మబగాంలో ధర్మాన కృష్ణదాస్ ను కలిశారు. ఈ సందర్భంగా కృష్ణ దాస్ మాట్లాడుతూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం మురళీ మాట్లాడుతూ తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు పూర్తి స్థాయిలో నెరవేర్చుతానని, పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తానని చెప్పారు. అంతకు ముందు నరసన్నపేటలో వైఎస్సార్ కూడలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనం తరం సుసరాంలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్ర హాం, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, పోలాకి మండల పరిషత్ సలహాదారు ముద్దాడ బైరాగినాయుడు, మండలపార్టీ అధ్యక్షుడు కణితి కృష్ణారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ దుంపల భాస్కరరావు, పార్టీ నాయ కులు చింతాడ ఉమామహేశ్వరరావు, బెండి శ్రీని వాస్, భావన వైకుంఠరావు, పైల మల్లేసు, కోరాడ చంద్రభూషణగుప్త, రాజాపు అప్పన్న, కనపల శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments