పోలాకి మండలం ఈదులవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రిక్స్ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరై పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుతూ పాడుతూ చదువుతూ దేహదారుఢ్యం , మానసిక వికాసం చాలా అవసరమని తెలిపారు. అదే మానసిక వికాసం రావాలంటే క్రీడలు ఒక ఔషధమని పేర్కొన్నారు. కానీ ఈ రోజుల్లో జీవితం ఒక యంత్రంలా పనిచేస్తుందని ఉదయాన్నే లేచేసరికి ఉరుకులు పరుగులు తీస్తూ చదువుకే అంకితం అవుతున్నారని తెలిపారు. ఒక మనిషి చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, ఆటలు పాటలు వంటివి అలవర్చుకోవాలని తెలిపారు ఈ రోజు మన దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు కి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్య అందిస్తున్నామని ప్రతి విద్యార్థి తిండి నుంచి వేసుకున్న షూస్ వరకు ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇస్తున్నామని విద్యా ప్రమాణాలు పెంచడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నామని కొనియాడారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి సంవత్సరం మెగాడిఎస్సి ని రూపుదిద్దే విధంగా కార్యక్రమాలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేస్తున్నిమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన l, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ రోణంకి కృష్ణన్నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎసిఎస్ చైర్మన్ భైరి భాస్కరరావు, సర్పంచ్లు తర్ర లక్ష్మీనారాయణ, చిట్టి సింహాచలం,రావాడ గణపతిరావు, బొమ్మాళి బలరాం,నగరపు రమణయ్య, భాస్కరరావు, ఎర్రయ్య, తహశీల్దార్, ఎంపీడీవో,మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు,వివిధ మండల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments