ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

రైతుల పక్షపాతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

పోలాకి: మండలంలోని,చల్లబంద కుసుమపోలవలస గ్రామాల్లో "రైతన్న - మీకోసం" కార్యక్రమానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శ్రీకారం చుట్టి గ్రామంలో రైతుల ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్ర బలం… అన్నదాతకు అండగా మన మంచి ప్రభుత్వమేనని, నీటిభద్రత నుండి అగ్రిటెక్ వరకు… 20 వేల రూపాయల వార్షిక సాయం వరకు రైతు అభ్యున్నతే కూటమి లక్ష్మమని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన అన్నదాతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ,వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమని, తమ ప్రభుత్వం రైతు రాజ్య స్థాపన కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.“నేనూ రైతు బిడ్డనే… రైతు ఎకరాలో ఏం సమస్య ఉంటుందో నాకు తెలుసు,అందుకే రాబోయే 5 సంవత్సరాల్లో రైతుని రాజును చేయడానికి ప్రభుత్వం నీటిభద్రత, పంటల మార్పిడి, అగ్రిటెక్ ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ అనే 5 ప్రధాన విధానాలతో ముందుకు సాగుతోంది” అని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యలను వివరించారు.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 20,000 సహాయం, రెండు విడతల్లో 6,300 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. డ్రిప్–స్ప్రింక్లర్లపై 70% నుండి 100% వరకు సబ్సిడీ, ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఖరీఫ్ & రబీకి రాయితీ విత్తనాల పంపిణీ, ఉద్యాన పంటలకు ఫ్రూట్ కేర్ ద్వారా అదనపు ఆదాయం.ధాన్యం, ఉల్లి, మామిడి, కోకో, పొగాకు వంటి పంటల కొనుగోలుకు ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున మద్దతు.కిసాన్ డ్రోన్లు, శాటిలైట్ సర్వే, డీప్ టెక్ ఆధారంగా పంటల పరిశీలన,పశు సంవర్ధక & ఆక్వా రైతులకు ప్రత్యేక సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు,అదే విధంగా గ్రామస్థాయిలో జరుగుతున్న “పొలం పిలుస్తోంది” కార్యక్రమం ద్వారా 40 వేల గ్రామాల్లో 11 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష సలహాలు అందుతున్నాయని తెలిపారు.“అన్నదాత నవ్వితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుతుంది. మీ ప్రతి ఎకరాకు నీరు, మీ ప్రతి ఇంటికి ఆదాయం, మీ ప్రతి పంటకు గిట్టుబాటు ధర — ఇది మన ప్రభుత్వ వాగ్దానం కాదుని భరోసా” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు పోలాకి పిఎసిఎస్ చైర్మన్ భైరి భాస్కరరావు తర్ర లక్ష్మీనారాయణ చిట్టి సింహాచలం ,భైరి అచ్చెన్నాయుడు,పైల రాజేంద్ర, కూన రాంబాబు, బోర అప్పలరాజు, తులసిపాటి కృష్ణంరాజు తహశీల్దార్ ఎంపీడీవో, వ్యవసాయ శాఖ ఏడి, ఏఓ, సచివాలయం సిబ్బంది కూటమి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments