ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

11న మహాత్మ పూలే జయంతి. కలెక్టర్ నివాస్

ప్రజా పత్రిక


-శ్రీకాకుళం, ఏప్రిల్ 9 : మహాత్మ జ్యోతిబా పూలే 195 జయంతిని ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీ చేస్తూ జ్యోతిబా పూలే జయంతి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన తెలిపారు. సాయి గిరి వద్ద  జ్యోతిబా పూలే పార్కులో 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు జయంతి కార్యక్రమం ప్రారంభం జరుగుతుందని పేర్కొన్నారు. బిసి సంఘ నాయకులు, ఇతర నాయకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments