నరసన్నపేట: కరోనా వైరస్ రెండో దశ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణ బాబు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ,శానిటైజర్ అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలిని , అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లు పై తిరగవద్దుని మరియు వాలంటీర్లు అనుమనుతులు పట్ల టెస్టింగ్ , ట్రాకింగ్ , ట్రీట్మెంట్ చూడాలని అభ్యర్దించారు.అలాగే మన ఏపీలో శనివారం నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రాత్రి 10 గంటలనుంచి ఉదయం 5గంటలవరకు అమల్లో ఉంటుందన్నారు. ప్రజలు గమనించగలరని కోరారు.ఇది మన అందరి బాధ్యతని ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.
0 Comments