ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యా దీవెన కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఫెడ్రిక్


నరసన్నపేట:చదువుతోనే విద్యార్ధుల రూపురేఖలు మారుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి ఫెడ్రిక్ అన్నారు . సోమవారం  స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలలో  జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధ్వర్యంలో నిర్వహించిన విద్యా దీవెన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధి గా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు   పిల్లలకు ప్రభుత్వం  ఇచ్చే నిజమైన ఆస్తి చదువేనని అన్నారు. ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద ఈ ఏడాది  ఫీజు రీయింబర్స్మెంట్ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ  చేశారని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకోని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గా ప్రసాద్ , అకాడమిక్ ఇంచార్జ్ ముకళ్ళ శ్రీనివాసరావు ,  బిసి వెల్ఫేర్ అధికారులు త్రినాధ రావు , వెంకటరావు , సంతోష్ కుమార్ పాల్గొన్నారు .

Post a Comment

0 Comments