ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యుత్ట్రా న్స్ఫార్మర్ తో గ్రామస్తులు భయాందోళనలు


ప్రజా పత్రిక-వంగర : మండలం మెట్టమగ్గురు గ్రామంలో మెయిన్ వీధిలో గల సింగల్ ఫేస్ ట్రాన్స్ఫారం మరమ్మతుల కారణంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామములో ఏ  ప్రమాదం జరిగిన మరమ్మతులు గురైన విద్యుత్ సరఫరాలో అంతరాయం  ఏర్పడిన ట్రాన్స్ఫర్ వద్ద  విద్యుత్తు నిలుపుదల చేయడానికి ఎలాంటి పరికరాలు ట్రాన్స్ఫారం కి   అమర్చ కపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అర్థంకాని పరిస్థితిలో ఉందని ఆ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కడ  ఏ ప్రమాదం సంభవించిన విద్యుత్తు లో అంతరాయం కలిగి న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద సౌకర్యాలు లేక వంగర సబ్ స్టేషన్ కు ఫోన్ చేసి వారికి తెలియజేసి వారు విద్యుత్తు నిలుపుదల చేస్తే గానీ గ్రామంలో ఎటువంటి మరమ్మతు చేయడానికి వీలు పడదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం బదులుగా త్రీ ఫేస్ ట్రాన్స్ఫర్  మగ్గురు గ్రామానికి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ట్రాన్స్ఫారం   ఏర్పాటు చేసిన  దిమ్మ శిథిలావస్థలో చేరుకోవడంతో  ఏప్పుడు  ఏ ప్రమాదం సంభవిస్తుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికైనా  సంబంధిత అధికారులు కల్పించుకొని మరమ్మతులు చేసి  సరి చెయ్యాలనిగ్రామస్తులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments