ప్రజా పత్రిక - ఆముదాలవలస,9:నియోజకవర్గంలో వకీల్ సాబ్ సినిమా విడుదల అభిమానులకు పండుగ రోజని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహన్రావు అన్నారు. శుక్రవారం జనసేన అధ్యక్షుడు, సినిమా నటుడు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కావడంతో అభిమానులకు పండుగ రోజు తలపించింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కటౌట్ లకు ఫాస్టర్ లకు పాలాభిషేకం, పూలాభిషేకం, మందుగుండు సామాగ్రి కాల్చి అత్యంత ఉత్సాహంగా గడిపారు.ఈ సందర్భంగా సినిమా వద్ద సందడి చేశారు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ జనసేన జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ రామ్మోహన్ మాట్లాడుతూ నాలుగేళ్లుగా సినిమా తెరపై కనబడని తమ నాయకుడిని చూసేందుకు యువత ఉత్సాహం చూపుతున్నారని, తమ నాయకుడు తెరపై చూడటం తమకు ఎంతో ఆనందంగా ఉందని కొనియాడారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఏర్పరిచిన తమకు నాయకుడిని చూసేందుకు యువత అభిమానులు అత్యుత్సాహం చూపారు. అలాగే సినిమా హాల్ వద్ద పోలీసులు కట్టు దిట్ట మైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతసేపు మందుగుండు కాల్చడానికి పోలీసులకు అభిమానులకు వాగ్వాదం జరిగింది . చివరకు మందుగుండు కాల్చడంతో యువకులు ఉత్సాహం చూపారు.
0 Comments