
ప్రజా పత్రిక: శ్రీకాకుళం, ఏప్రిల్ 9: డిగ్రీ చదవలసిన విద్యార్థుల నష్ట పోకుండా చూడాలని ఎం ఎల్ ఆర్ నాయుడు విద్యాసంస్థల అధినేత లయన్ డాక్టర్ ముద్దాడ బాల భూపాల నాయుడు కోరారు.ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు ఫస్టు, సెకండ్ కౌన్సిలింగ్ పూర్తయి కాలేజీలో కేటాయింపులు జరిగినప్పటికీ చాలా మంది విద్యార్థులు కేటాయింపు జరిగిన కాలేజీలలో అడ్మిషన్లు కన్ఫామ్ చేసుకోలేదు. ఆన్లైన్లో అడ్మిషన్ల కోసం కనీసము రిజిస్ట్రేషన్ కూడా చేసుకొని వారు ఇంకా చాలామంది మిగిలినట్టు బోగట్టా, ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వారు మూడో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారా లేదా అన్నది కన్ఫర్మ్ కాలేదు అని తెలిపారు. మొదటి విడత రెండో విడత కౌన్సెలింగ్ లో సీట్లు కేటాయింపు జరిగినప్పటికీ విద్యార్థినీ విద్యార్థులు ఆయా కాలేజీలలో కన్ఫామ్ చేసుకోకుండా ఉండే విధంగా కొన్ని కాలేజీలు విద్యార్థులకు నేరుగా ఆ ఆ కాలేజీలలో నే స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇస్తామని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతము ఉన్న గవర్నమెంటు రెగ్యులేషన్స్ ప్రకారం ఆన్లైన్ ద్వారా సీట్లు పొందలేని విద్యార్థినీ విద్యార్థులను స్పాట్ అడ్మిషన్ ల ద్వారా కాలేజీలలో చేర్చుకోవచ్చు. కానీ ఆ విద్యార్థిని విద్యార్థులకు గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అభివృద్ధి పథకాలు వర్తించవని తెలిపారు. వివిధ కాలేజీల వాళ్ళు విద్యార్థినీ విద్యార్థులను ఈ విధంగా తప్పుదోవ పట్టించడం వలన వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఒక ప్రకటనలో వివరించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఇంకా రిజిస్టర్ కాని విద్యార్థులు సీట్ అలాట్మెంట్ జరిగిన కూడా కన్ఫర్మ్ చేసుకుని విద్యార్థులకు ఆయా ప్రాంతాల వలంటీర్ల ద్వారా గవర్నమెంట్ వారి నిబంధనలను వివరించే పనిని చేపట్టి విద్యార్థినీ విద్యార్థులు నష్టపోకుండా సహకరించగలరని ఆ ప్రకటనలో కోరారు.
0 Comments