ప్రజా పత్రిక-పలాస:సీనియర్ పాత్రికేయులు, స్నేహశీలి, సహృదయులు, ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి, విశాఖ టుడే పలాస విలేకరి దశ ముఖ చిన్నారావు (49)
కరోనా బారిన పడి శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఎటువంటి ఆస్తి పాస్తులు లేవు. గత తొమ్మిది సంవత్సరాలుగా జర్నలిస్టుగా సమాజానికి సేవలందిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారావు జర్నలిజంపై ఆధారపడి జీవనోపాధి పొందేవారు. నీతి, నిబద్ధత , హుందాతనం, మొక్కు వోని ధైర్యంతో ఈయన రాసే కథనాలు ప్రజా సమస్యలు పరిష్కారం తో పాటు గొప్ప ప్రాచుర్యం పొందాయి. నిరుపేద కుటుంబానికి చెందిన జర్నలిస్టు చిన్నారావు మృతితో ఆ కుటుంబం వీధిన పడింది .ఈ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి కరోనాతో మృతి చెందిన చిన్నారావు కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. జర్నలిస్టు చిన్నారావు మృతి పట్ల రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పలాస ప్రెస్ అధ్యక్ష కార్యదర్శులు బి. రవికుమార్, కింజరాపు కృష్ణారావులతో పాటు కార్యవర్గ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
0 Comments