ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రశాంతంగా ముగిసిన జెడ్.పి.టి.సి,ఎం. పి.టి.సి. ఎన్నికలు. జిల్లా యస్.పి శ్రీ అమిత్ బర్దార్


ప్రజా పత్రిక - శ్రీకాకుళం,ఏప్రిల్.09.జిల్లాలో జెడ్.పి.టి.సి,/ఎం.పి.టి.సి. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయిని జిల్లా ఎస్పీ అన్నారు.ఎటువంటి ఘటనలను కూడా తావులేకుండా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా ప్రజలు మరియు పోలీసు అధికారులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలుపుతు జిల్లా ఎస్పీ గారు శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 590 ఎం.పి.టి.సి స్థానాలకు,37 జెడ్.పి.టి.సి స్థానాలు కు ఎన్నికలు ఒకే విడతలో జరిగాయనిన్నారు. ఇందులో 2288 పోలింగ్ కేంద్రాలు మొత్తంగా1466   పోలింగ్ లొకేషన్స్ లో సాధారణ లొకేషన్స్ 1231, సెన్సిటివ్ లొకేషన్స్ 144,హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ 79,

నక్షల్ ప్రభావిత  12 లొకేషన్స్   వద్ద వీడియో కెమెరాలు,వెబ్ కాస్టింగ్,సీసీ కెమెరాల ఏర్పాట్లు,డ్రోన్ కెమెరాలు మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిషత్ ఎన్నికల విధులులో 1700 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు,ఇతర విభాగల నుంచి పారా పోలీసు సిబ్బందిగా 2100 మంది పైగా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందిని  ఆయన తెలిపారు. పరిషత్ ఎన్నికలు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమై నుంచి జిల్లా పోలీసు యంత్రాంగం ఒకే దశలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు  జరక్కుండా జిల్లా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వహించరాని తెలిపారు. 


సబ్ డివిజను,సర్కిల్ స్థాయిలో డిఎస్పీ స్థాయి పోలీస్ ఉన్నత అధికారులు  సిబ్బందితో సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో సందర్శించి ఫ్లాగ్ మార్చులు నిర్వహించి ఎన్నికలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించారుని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో పాల్గొన్న సిబ్బంది మరియు ఇతర విభాగాల పార పోలీస్ సిబ్బందికి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తు ఎన్నికలు ప్రక్రియ పూర్తయిన వరకు పకడ్బందీగా విధులు నిర్వహించారుని అన్నారు.


పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల రోజు పోలీస్ అధికారులు సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ఓటర్లకు కోవిడ్ నియమ నిబంధనలు ప్రకారం మాస్కలు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లు చేయడం జరిగింది అని అన్నారు.


జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల అనంతరము శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా  ఉన్న 10 స్ట్రాంగ్ రూం వద్ద జరిగిన పరిషత్ ఎన్నికల  బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే నిమిత్తం  పటిష్ట భద్రత ఏర్పాట్లును ఏర్పాటు చేయడమైనదిని అన్నారు.సదరు స్ట్రాంగ్ రూంలలో బ్యాలెట్ బాక్సులను భద్రత పరమైన అంశాలపై అధికారులుకు అదేశాలు ఇవ్వడం జరిగిందిని, స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని,నలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేటట్లు భద్రత ఏర్పాటులు చేసేమన్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ రూం భద్రత నిమిత్తం ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది  24X7 గార్డ్ విధుల్లో నిరంతరం అప్రమత్తంగా నిర్వర్తిహించే విధంగా చర్యలు తీసుకోవాలని, అధికారులునకు అదేశాలు జారీ చేయడం జరిగిందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు..

Post a Comment

0 Comments