ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్.


ప్రజా పత్రిక - శ్రీకాకుళం:జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల అనంతరము శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న  మండలలో జరిగిన పరిషత్ ఎన్నికల  బ్యాలెట్ బాక్సులను భద్రపరిచే నిమిత్తం ఎచ్చర్ల నందు శివాని ఇంజనీర్ కళాశాల, శ్రీకాకుళం పట్టణంలో స్థానిక  ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లును గురువారం నాడు  ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించారు.సదరు స్ట్రాంగ్ రూం లలో ఉన్న భద్రత పరమైన ఏర్పాట్లను గురించి  స్వయంగా జిల్లా ఎస్పి గారు పరిశీలించి,బ్యాలెట్ బాక్సులను మరియు స్ట్రాంగ్ రూం వద్ద ఎంత మంది సిబ్బందిని  ఎక్కడ ఎక్కడ ఏవిధంగా ఉపయోగించాలినే విషయాల పై అధికారులనకు తగిన సూచనలు సలహాలను చేశారు. స్ట్రాంగ్ రూం నలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.అదేవిధంగా స్ట్రాంగ్ రూం భద్రత నిమిత్తం ఆర్మ్డ్ సిబ్బంది విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు,సిబ్బందిని ఆదేశించారు.

Post a Comment

0 Comments