నరసన్నపేట పద్మావతి డిగ్రీ కళాశాలకు చెందిన ధర్మాన దాక్షాయని విప్రో సంస్థకు ఎంపికయ్యిందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు . రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ అధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఆమె ఉద్యోగం సాధించిందని అయన గురవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతపు విద్యార్ధులు విప్రో వంటి బహుళజాతి సంస్థలో ఉద్యోగం సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ట్రైనింగ్ విభాగం అధ్యాపకులను రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ జిల్లా మేనేజర్ గోవిందరావు అభినందించారు.
0 Comments