ప్రజా పత్రిక - శ్రీకాకుళం,ఏప్రిల్ 9.మానసిక ఉల్లాసం తోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందిని అదనపు ఎస్పీ పి.సోమశేఖర్ అన్నారు.జిల్లా ఎస్పీ అమిత్ బర్దారు సూచనలు మేరకు,శుక్రవారం నాడు స్థానిక ఏ.పి.హెచ్ బి., కోలనిలో ఉన్న బేహారా మనో వికాస కేంద్రం ( మానసిక వికలాంగుల పాఠశాల)ను సందర్శించారు.ఇందులో భాగంగా మానసికంగా బాధపడుతున్న చిన్నారులతో కాసేపు గడిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి నిలయంలో చేస్తున్న ఏర్పాటులును పరిశీలించి మానసిక రోగులు,అనారోగ్య సమస్యలు ఉన్నా బాల బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులును సూచించారు.వసతి సౌకర్యాలు, పౌష్టికాహారం,మంచి నీరు,భోజన వసతి ఇతర సదుపాయాలు ఉండేటట్లు చూడాలని నిర్వహకులు సూచించారు. అదేవిధంగా సకాలంలో వైద్యం అందేటట్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిబ్బంది యొక్క పనితీరు, సంబంధిత శాఖల యొక్క సహాయ సహకారాలుపై ఆరా తీశారు. అదేవిధంగా పిల్లల వివరాలు వారి కుటుంబ నేపద్యం మరియు వారి చదువుకోవడం వంటి పలు అంశాలపై చర్చించారు.ముఖ్యంగా నిలయలులో సీసీ కెమెరాల తప్పకుండా ఏర్పాటు చేయాలని వికాస కేంద్రం నిర్వకాలుకు పలు సూచనలు సూచించారు.
ఈ కార్యక్రమంలో సి.డబ్ల్యూ.సి చైర్మన్. జి.నరసింహ మూర్తి,సభ్యులు బి.సురేష్,
డి.సి.పి.ఓ., కె.వి.రమణ, డి.పి.ఓ., ఓ. వి.ఎల్. సత్యనారాయణ, పి.ఓ., ఎం. మల్లేశ్వరరావు, బి.బి.ఏ., స్టేట్ కో ఆర్డినేటర్ బి.చంద్రశేఖర్, పోలీసు ఏ. హెచ్.టి.యూ. టీం సభ్యులు పాల్గొన్నారు.
0 Comments