ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పోరాడి నూతన వేతన ఒప్పందం సాధించుకున్న నాగార్జున అగ్రికమ్ కార్మికులు.

ప్రజా పత్రిక-శ్రీకాకుళం:పోరాడి విజయం సాధించిన నాగార్జున అగ్రికమ్ కార్మికులకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అభినందనలు తెలియజేశారు. మంగళవారం శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో నాగార్జున అగ్రికమ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ  కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు,నిరాహారదీక్షలుతో పాటు వివిధ రూపాల్లో నాగార్జున అగ్రికమ్ కార్మికులు పోరాట ఫలితంగా వేతన ఒప్పందం సాధించుకోవడం జరిగిందని అన్నారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగిన చర్చల్లో నాగార్జున అగ్రికమ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం)కు, యాజమాన్యంకు, బాలాజీ ఇంజినీరింగ్ సర్వీసెస్&మేన్ పవర్ కాంట్రాక్టర్ కు మధ్య సుదీర్ఘ చర్చలు అనంతరం వేతన ఒప్పందం జరిగిందని,ఈ ఒప్పందం 3సంవత్సరాలు అమలులో ఉంటుందని అన్నారు.రెగ్యులర్ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న వేతనం పై నెలకు రూ:3010/-లు, కాంట్రాక్టు కార్మికులకు ప్రస్తుతం ఉన్న వేతనం పై రోజుకు రూ:74/-లు,టెక్నికల్ కార్మికులకు రూ:75/-లు పెరుగుతుందని అన్నారు. అటెండెన్స్ బోనస్, నైట్ షిఫ్ట్ అలవెన్సు,ఎల్.టి.ఏ అదనంగా పెరుగుతున్నాయని అన్నారు.కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ యధావిధిగా కొనసాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు, నాగార్జున అగ్రికమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు ఎల్.వరదరాజు,పి.సత్యనారాయణ,కోశాధికారి చిక్కాల.సత్యనారాయణతో పాటు నాయకులు కె.రమణ, ఎల్.రామప్పడు, ఎస్.పరశురాం,ఎస్. గోవింద,పి.చిన్న,లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments