ప్రజా పత్రిక - శ్రీకాకుళం:ఉత్తరాంధ్రలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రజల ఇలవేల్పు కోటి వరాల తల్లి భక్తులు పాలిట కల్ప వల్లి శ్రీకాకుళం నగరములో వెలసిన శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానములో లోకం క్షేమంగా ఉండాలని కరోనా మహామ్మరి ప్రబలకుండా తగ్గు ముఖం పట్టాలని మహా మృత్యుంజయ జపం మహా మృత్యుంజయ హోమం నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశాఖ బహుళ సప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం దేశం సుభిక్షంగా ఉండాలని కోవిడ్ 19 మహామ్మరి కరోనా వైరస్ బారి నుండి అందరికీ విముక్తి కలగాలని ప్రపంచములో ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యలతో ఉండాలని లోక కళ్యాణార్థం అమ్మవారికి సుప్రభాత సేవ, అభిషేకము సేవ నిత్య పూజలు, లలితా పారాయణం దుర్గ సూక్తం పారాయణం అమ్మ వారి జపం నవగ్రహా జపాలు మృత్యుంజయ జపం, మృత్యుంజయ హోమం సకల దేవతా హోమం నవగ్రహాలు హోమం రుద్ర సహిత సంతోషిమాత లక్ష్మీ గణపతి హోమం
సహస్త్రనామార్చనా పూజ సేవ, కుంకుమ పూజ ,శ్రీ లలిత సహస్త్రనామా పారాయణం, మహానివేదన మహా హారతి వేద ఆశీర్వచనము వేద పారాయణం, ఏకాంతంగా ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించామన్నారు. ప్రతిరోజు శ్రీ సంతోషిమాత దేవాలయం లో లోకకల్యాణార్థం కరోనా నివారణకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మని ఆలయ కార్యనిర్వహణాధికారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు.
0 Comments