ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రైవేటు ఉపాధ్యాయులకు,అధ్యాపకులకు నిత్యావసర సరుకుల పంపిణీ


శ్రీకాకుళం:కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాద్యాయుల కుటుంబాలకు 75 కిలోల బియ్యం, మంచి నూనె, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులను జాతీయ మానవ హక్కుల సెల్, జిల్లా అధ్యక్షులు పెదకోట కళ్యాణ్ సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా హెచ్ఆర్సి జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఉపాద్యాయులు పరిస్థితి దయనీయంగా మారింది అన్నారు.గత సంవత్సరం కాలంగా కరోనా విపత్తు ఏర్పడడంలో చాలామంది ప్రవైట్ ఉపాద్యాయుల కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి ఏర్పడింది.విద్యాసంస్థలకు సెలవులు రావడంతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడం ప్రభుత్వం పట్టించుకోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం కోసం నానా అవస్థలు పడుతున్నారన్నారు.ఇంత సహృదయంతో ఈ కార్యక్రమానికి దాతలగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభాకర్ రావు, రామ్ సాయి, వంశీ గుప్తా, మహేష్, వంశీ, ప్రైవేటు పాఠశాల ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments