ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు ప్రారంభించిన కలెక్టర్ నివాస్

ప్రజా పత్రిక : నరసన్నపేటలోని శ్రీ లక్ష్మి థియేటర్‌లో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంక్‌ను కలెక్టర్‌ జె.నివాస్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలిచి ఉచిత ఆక్సిజన్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన నటుడు చిరంజీవిని ప్రశంసించారు. జిల్లాలో కోవిడ్‌ తీవ్రత ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అవసరం లేని వారు బయటకు రావద్దని సూచించారు. జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవాలన్న ప్రయత్నం అభినందనీయమన్నారు. చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు పర్యవేక్షకులు గేదెల చైతన్య మాట్లాడుతూ కరోనా మొదటి, రెండో వేలోనూ చిరంజీవి కోవిడ్‌ రోగులను ఆదుకున్నారని చెప్పారు. ఆక్సిజన్‌ అవసరమైన వారు సెల్‌ఫోన్‌ నెంబరుకు 8977250290 , 9515157777 ఫోన్‌ చేసి, తగిన ధ్రువపత్రాలు చూపిస్తే ఉచితంగా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆక్సిజన్‌ బ్యాంకు ఇన్‌ఛార్జి గురుప్రసాద్‌, ప్రవీణ్‌, చిరు ఫ్యాన్స్‌ అధ్యక్షులు సిద్ధయ్య, ఉదరు, నవీన్‌, వెంకీ, మధు, జయంత్‌, సూర్య, తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

0 Comments