ప్రజా పత్రిక-పాలకొండ:చెత్త సేకరణ రుసుముల ప్రజలపై భారాలు వేయ వద్దు.పాలకొండ పట్టణ పౌరహక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో పావలకొండ పట్టణంలో ఈరోజు ఇంటింటా కరపత్రం సంతకాల సేకరణ కార్యక్రమం స్థానిక 19వ వార్డు కస్పా వీధి నుండి కాపు వీధిలలో ప్రచారకార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోరాట వేదిక ఉపాధ్యక్షులు బుడితి అప్పలనాయుడు కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస రావు బెజ్జిపురం చిన్న నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఆయా వీధిలో ప్రచారంలో భాగంగా ప్రజలతో సంఘం ఉపాధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తి విలువ లెక్కించే ఇంటి పన్ను వేసి పన్నుల భారాన్ని పెంచడం ఎంత వరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఒకవైపు కరోనా వైరస్ తో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పనులు లేక ఆదాయాలు కోల్పోయి అన్ని వర్గాల ప్రజల బ్రతుకుతూ ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం భారాలు వేయడం తగదని అన్నారు. కావున సోమవారం నాడు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద జరుగు వినతి పత్రం కార్యక్రమంను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
0 Comments