ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రైవేట్ అధ్యాపకులకు జీతాలు చెల్లించకపోతే ఉద్యమిస్తాం.ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్

నరసన్నపేట పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్(PTLU) సమావేశం నిర్వహించామని ప్రతినిధులు మల్లేశ్వరరావు,కసవయ్య తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసన్నపేటలో ప్రైవేట్ యాజమాన్యాలు జగనన్న విద్యా దీవెన రూపంలో పిల్లల దగ్గర నుంచి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేసినప్పటికీ అధ్యాపకులకు మాత్రం వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు.దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతము జీతాలు లేక  ఆత్మహత్యలే శరణ్యం అన్నారు. విద్యాశాఖ అధికారులు,సీఎం జగన్ అందించి కరుణ కష్టకాలంలో గత 12 నెలల జీతాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.శ్రీకాకుళం జిల్లాలో అన్ని కాలేజీలు జీతాలు ఇచ్చినప్పటికీ నరసన్నపేటలో మాత్రమే జీతాలు చెల్లించక మా జీవితాలతో ఆడుకోవడం ఎంత వరకు సమంజసమని మండిపడ్డారు. కళాశాల అభివృద్ధికి రాత్రింబవళ్లు కష్ట పడిన మాకు అన్యాయం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఈరోజు మామూళ్లు రోడ్డుపైన వదిలేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికీ ప్రైవేట్ కళాశాలలు జీతాలు చెల్లించకపోతే మేము నిరసన తెలియజేస్తూ ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments