టెక్కలి, జూన్ :11: ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని సబ్ కలెక్టర్ సూరజ్ జ్ ధనుంజయ గానో రే అన్నారు, శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ను వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ,గత తొమ్మిది నెలలు సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ (గృహ నిర్మాణ శాఖ) బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలువురు రెవిన్యూ అధికారులు మాట్లాడుతూ అభివృద్ధి , సంక్షేమ ఫలాలు అమలులో సబ్ కలెక్టర్ చూపిన చొరవ స్ఫూర్తిదాయకమని కొనియాడారు, కిందిస్థాయి అధికారుల కు ఇచ్చిన సహకారం మరువలేనిదని అన్నారు. అనంతరం డివిజన్ రెవిన్యూ అసోసియేషన్ , ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ను పూలమాల వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో కార్యాలయం, పరిపాలనాధికారి కళ్యాణ చక్రవర్తి, డివిజన్ లోని తాసిల్దార్ లు , డివిజినల్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు, లక్ష్మణరావు, పలువురు సిబ్బంది, పాల్గొన్నారు
0 Comments