ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సేవతోనే ఆనందం - ప్రముఖ వ్యాపార వేత్త సూర శ్రీనివాసరావు.

సేవతోనే ఆనందం - ప్రముఖ వ్యాపార వేత్త సూర శ్రీనివాసరావు.

34 వ రోజు కొనసాగిన సూర శ్రీనివాసరావు భోజన పంపిణీ కార్యక్రమం.

నేడు డే అండ్ నైట్, ఏడు రోడ్ల కూడలి, రిమ్స్, కిమ్స్ ఆసుపత్రిలు వద్ద 500 మందికి ఆహారపొట్లాల పంపిణీ.
 
ప్రజా పత్రిక-శ్రీకాకుళం:మానవ సేవలోనే నిజమైన ఆనందం ఉందని ప్రముఖ వ్యాపార వేత్త సూర శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న వారికి గత 34  రోజులుగా 400 నుండి 500 మందికి సూర శ్రీనివాసరావు భోజనం మరియు మంచి నీళ్లు ను తన చేతుల మీదుగా అందిస్తున్నారు. ఎచ్చెర్ల మండలం, కుశాలపురం గ్రామానికి చెందిన వ్యాపార వేత్త సూర శ్రీనివాసరావు చేస్తున్న ఈ సేవలకు గాను జిల్లా ప్రముఖుల  అందరి నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ రోజు డే అండ్ నైట్ జంక్షన్, ఏడు రోడ్ల కూడలి మరియు కిమ్స్, రిమ్స్ హాస్పిటల్ లో గల పేషెంట్ల సహాయకులకీ, సిబ్బందికీ 500 భోజన ప్యాకెట్లును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర శ్రీనివాసరావు  మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో  పేదలకు చేస్తున్న సేవలోనే తనకు ఆనందం కలిగిందిని అన్నారు.

Post a Comment

0 Comments