ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మనసున్న మారాజు సూర శ్రీను. సమాజానికి సూర శ్రీను సేవలు అవసరం.జిల్లా జడ్జి రామకృష్ణ ప్రశంసలు.200 మంది కోర్టు సిబ్బందికి నిత్యవసర కిట్ల పంపిణీసేవలోనే సంతృప్తి ఉందంటున్న సూర శీను

శ్రీకాకుళం: కరోనా విపత్కర కాలంలో అన్ని రంగాల ప్రజలకు చేతనైన సాయం చేస్తూ ఆదుకుంటున్న సూర శ్రీనివాసరావు మనసున్న మారాజు అని జిల్లా జడ్జి జి రామకృష్ణ అన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో సోమవారం కోర్టు సిబ్బంది, జూనియర్ న్యాయవాదులకు పదిహేను వందల రూపాయలు విలువచేసే నిత్యావసర సరుకులను 200 మందికి పంపిణీ చేశారు. సమాజానికి సుర శీను వంటి వ్యక్తుల సేవలు ఎంతో అవసరం అని కొనియాడారు. నేటి సమాజంలో పేద శ్రమను దోచుకునే పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో పేదవాని కడుపు నింపి వారి కళ్ళల్లో ఆనందం చూడాలని తపిస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి  సూర శీను అని జిల్లా జడ్జి కొనియాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక ఈ సతమతమవుతున్న తరుణంలో వారి అవసరాలను గుర్తించి తీరుస్తున్న శ్రీను సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కరోనా విపత్కర వేళ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న జూనియర్ న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి నెలరోజులు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం హర్షణీయమని జిల్లా జడ్జి పేర్కొన్నారు. బార్ అసోసియేషన్  జిల్లా అధ్యక్షులు సిస్టు రమేష్ మాట్లాడుతూ న్యాయవాదుల ఇబ్బందులను సామాజిక సంఘసంస్కర్త దృష్టికి తీసుకు వెళ్లిన వెంటనే స్పందించి సహాయం చేయడానికి ముందుకు రావడం స్పూర్తి దాయకమని అన్నారు. కోర్టు సిబ్బందికి, జూనియర్ న్యాయ వాదులకు 200 నిత్యవసర కిట్లను ఆధ్వర్యంలో పంపిణీ చేశామనీ తెలిపారు. సమాజంలో ఎందరో ధనవంతులు ఉన్న దానం చేసే గుణం కొందరికి ఉంటుందని, అందులో మొదటి స్థానంలో సూర శ్రీను నిలిచారని ఆయన వివరించారు. ప్రముఖ వ్యాపారవేత్త సామాజిక సేవవేత్త  సూర శ్రీను మాట్లాడుతూ కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటం తనను బాధించిందని అన్నారు. తనకు చేతనైన సాయం చేసి వారికి బాసటగా నిలవాలని ఆలోచనతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. ప్రతిరోజు సేవా కార్యక్రమం చేయడంతో తనకు ఎంతో ఆనందం కలుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. నగరంలోని జెమ్స్, రిమ్స్, కిమ్స్ ఆస్పత్రిలతోపాటు పాటు పలు వార్డుల్లో హోమ్ ఐసోలేషన్ ఉంటూ చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు 500 మందికి భోజనాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సూర శ్రీను సేవలను కొనయాడుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి రామకృష్ణ సూర శ్రీనును దుశ్శాలువ కప్పి, మెమొంటో అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో 2వ అడిషనల్ జిల్లా జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ సబ్ నాగమణి లోక్ అదాలత్ జడ్జి జయలక్ష్మి, మొబైల్ కోర్టు జడ్జి లెనిన్ బాబు, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కె రాణి, ఫ్యామిలీ కోర్ట్ జడ్జీ అన్నపూర్ణ, న్యాయవాదులు సనపల హరి, కృష్ణచంద్, ఆదినారాయణ తదితులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments