ప్రజల పై భారాలు మోపె ఆస్తివిలువపై ఇంటి పన్ను వేయడం వెనుకకు తీసుకోవాలి.రౌండ్ టేబుల్ సమావేశం తీర్మాణం.
పుర ప్రజలలో చైతన్యం కై ఇంటింటికి కరపత్రం పంపినణీ.
పుర ప్రజలతో ఉధ్యమానికి శ్రీకారం.
ఎలైట్ కాలేజీ లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ర్ట ప్రభుత్వం తీసుకువచ్చిన ఆస్తివిలువపై ఇంటి పన్ను, చెత్తసేకరణ కై రుసుము వసుల్లు వంటి భారాలు మోపే జి.ఓ.నెం.196,197,198లను వెంటనే ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలి.
కరోనా మహమ్మారి తో అన్నివర్గాల ప్రజలు పనులుకోల్పోయి ఆదాయాలు అంతంతమాత్రమే ఉండగా ఆదుకోవలసిన విపత్కర పరిస్దితులలో పన్నులభారం మోపడం తగునా అంటు రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష ప్రజాసంఘాల ప్రతినిధులు ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కనపాక చౌదరి నాయుడు అధ్యక్షతన జరిగిన సమమావేశంలో సి.పి.ఐ పాలకొండ నియోజకవర్గం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతు పాలకొండ నగరపంచాయితీలో సుమారు 8500 గృహస్తులు ఇంటిపన్ను చెల్లిస్తున్నవారు ఉండగ, వారి నుండి ఒకొక్క ఇంటికి చెత్తసేకరణ రుసుము నెలకు 60 రూపాయిలు చప్పున్న సంవత్సరానికి 720 రూపాయిలు భారం మోపి ముక్కుపిండి వస్సుల్లు చేయడం ద్వారా సంవత్సరానికి 60,000/-అక్షరాల అరవై లక్షల రూపాయల భారం పడుతుందన్నారు ఈ భారాన్ని మోయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.
బి.జె.పి.సీనియర్ నాయుకులు టంకాల దుర్గారావు మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గంట సంతోష్ కుమార్ లు మాట్లాడుతు ఈ ఉధ్యమానికి మద్దత్తు ఇస్తున్నామని ఇప్పటికే ఆంధోళనలు చేస్తున్నట్లు తెలిపారు.
రౌండ టేబుల్ సమావేశం తీర్మాణాలు.
1.పట్టణ ప్రజల హక్కుల పోరాట వేదిక (ఈపేరుతో పాలకొండ పట్టణంలో ప్రజా సమస్యలపై ఉధ్యమించాలని పోరాటానికి పేరును నామకరణ జరిగింది).
2.ఇంటింటికీ కరపత్రం పంపిణీ సంతకాలు సేకరణ జూన్ 23-27 వరకు
3.జూన్ 28 న సోమవారం పాలకొండ నగర కమీషనర్ కు సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం సమర్పించుట.
ఆస్తివిలువపై ఇంటిపన్ను వేయడం చెత్తసేకరణ పై రుసుములు తగ్గేవరకు ప్రజాఉధ్యమే సరణ్యమని జనసేన పార్టీ ప్రతినిధి గర్భాపు నరేంద్ర,వర్తక ,వాణిజ్య, ప్రజా సంఘాల నాయుకులు నందాన రమేష్,బత్తుల శ్రీనివాసరావు, వండాన కూర్మారావు, సబ్బ నానాజీ, ఎడ్ల శ్రీనీవాస రావు దండన పార్వతీశ్వరావు, రామినాయుడు,డి.రవీంద్రకుమార్,బి. గోపి కృష్ణ తధితరులు పాల్గొన్నారు.
0 Comments