ప్రజా పత్రిక-శ్రీకాకుళం, జూన్ 3 : జగనన్న కాలనీలు కాలనీలు కాదని - ఊళ్ళు, పట్టణాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్ళ నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం వర్చువల్ విధానంలో గురువారం జరిగింది. జిల్లాలో లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ముఖ్య మంత్రి శంఖుస్దాపనకు జగనన్న లే అవుట్ లో జరిగింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా పేదలందరికి ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశలలో 28.30 లక్షల గృహాలను రూ.50,940 కోట్లతో చేపట్టుటకు నిర్ణయించామని ముఖ్యమంత్రి చెప్పారు. మొదటి దశలో 15.60 లక్షల గృహాలను .28,084 కోట్లతో చేపట్టుట జరుగుతుందని అన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఒక్కొక్క అక్కాచెల్లెమ్మలకు రూ.5 నుండి రూ.16 లక్షల విలువ చేసే ఆస్తి దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఐచ్చికాలు ఆధారంగా గృహ నిర్మాణం చేస్తామని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణం వలన రాష్ట్రంలో ఆర్థిక రంగం మెరుగుపడుతుందని ఆయన అన్నారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ
మొదటి దశలో జిల్లా వ్యాప్తంగా 97,616 గృహముల నిర్మాణాన్ని రూ.1757కోట్లతో చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో 830 వై.యస్.ఆర్. జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి, లే- అవుట్ లలో 41,013 గృహాలను, భూమి స్వాధీన సర్టిఫికేట్ జారీ చేసిన 25,007 గృహాలను, స్వంత స్థలాల్లో 31,596 గృహాలకు శంకుస్ధాపన జరుగుతుందని చెప్పారు. ఇళ్ళు నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా పనులు చేయుటకు ప్రభుత్వం రూ.74 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. బెజ్జిపురం లే అవుట్ లో 114 గృహాలను రూ.205.20 కోట్లతో నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలో పాత్రునివలసలో 669 గృహాల నిర్మాణానికి, నరసన్నపేట నియోజకవర్గం పాలకొండపేటలో 6 గృహాలు, టెక్కలి నియోజకవర్గం శ్యామసుందరాపురంలో 383 గృహాలకు, పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలో 443 గృహాలకు, ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం భైరిపురంలో 142 గృహాలకు, పాలకొండలో 1119 గృహాలకు, రాజాం నియోజకవర్గం పెనుబాకలో 70 గృహాలకు లాంఛనంగా చేపట్టనున్నారు. ఈ లే అవుట్లలో 3,432 స్ధలాలు ఉండగా ఇప్పటి వరకు 2,946 మందికి మంజూరు చేయడం జరిగింది.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే – ఎచ్చెర్ల నియోజకవర్గంలో 5,268 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 2,671 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 12,275 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 9,015 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 12,154 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 4,206 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో 9,230 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 2,931 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలో 14,641 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 5,233 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. పలాస నియోజకవర్గంలో 15,260 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 5,439 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 12,904 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 6,175 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. పాలకొండ నియోజకవర్గంలో 1,244 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 1,119 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. రాజాం నియోజకవర్గంలో 9,740 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 2,594 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు. పాతపట్నం నియోజకవర్గంలో 4,900 మంది లబ్దిదారులు ఉండగా లే అవుట్లలో 520 మంది స్ధలాలు పొందగా మిగిలినవారు భూమి స్వాధీన సర్టిఫికేట్ పొందిన వారు, స్వంత స్థలాలు ఉన్నవారు లబ్దిదారులుగా ఉన్నారు.
చేతి వంట తినాలి :
గృహ లబ్దిదారు మీగడ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. పెద్ద కుటుంబం, చిన్న ఇల్లు అని జగనన్న ఇచ్చిన గృహంతో సంతోషం అన్నారు. మా హృదయాల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. మా ఇంటికి విచ్చేసి ఆతిధ్యం స్వీకరించాలని కోరారు. స్థలం విలువ రూ.3.50 లక్షలు చేస్తుందని, యూనిట్ ఖరీదు రూ.1.80 లక్షలు అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నారని ఇది ఎంతో మేలు చేస్తుందని ఆమె చెప్పారు. సొంతంగా నిర్మించుటకు రూ.10 నుండి 20 లక్షలు అవుతుందని ఆమె చెప్పారు. చిరకాలం ముఖ్యమంత్రి గా ఉండాలని, ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని ఆమె ఆకాంక్షించారు. మా అత్తకు చేయూత అందిందని, మా మామకు టైలర్ లకు ఇచ్చే సహాయం అందిందని తెలిపారు. ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహాయం వృధా చేయకుండా టైలరింగ్ మెషిన్లను కొన్నామని వివరించారు.
ఈ సందర్భంగా గృహ నిర్మాణంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ లాంఛనంగా శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు, శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, రెడ్డి శాంతి, కళింగ, కాపు కార్పొరేషన్ల చైర్మన్లు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, మండల ప్రత్యేక అధికారి పి.రాధ, సంబంధిత అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
0 Comments