ప్రజా పత్రిక -ఎచ్చెర్ల మండలం శేషుపేట గ్రామంలో డా. బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం ముందు కెవిపియస్ అద్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఆద్యుక్షులు సుత్తి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిలో అందరికీ వ్యాక్సిన్, ఆక్సిజన్, మందులు అందించడంలో విఫలమైందని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టానుసారంగా డబ్బులు దోచుకుంటుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరు ఎత్తునట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు, వైద్యం అందించాలని, ప్రతీ కుటుంబానికి కేరళ తరహాలో నిత్యావసర వస్తువులు ఇవ్వాలని, ప్రతీ కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కరోనా సమయంలో కూడా దళితులపై దుర్మార్గమైన దాడులు జరుగుతున్నాయి.జిల్లాలో రాజాం మండలం గురవాం ,లావేరు మండలం ఆదపాక,జలుమూరు మండలం బావాజీపేట,బూర్జీ మండలం తోటవాడ, సంతకవిటి మండలం కొండగూడెం, రణస్థలం మండలం గాసాం,శ్రీకాకుళం మండలం కాసెంవలస,మొదలగు గ్రామాల్లో దళితులపై దాడి చేసిన ముద్దాయిలను అరెస్టు చేయకుండా అధికార యంత్రాంగం కొమ్ముకాస్తుందని వాపోయారు.దళితులపై దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, సబ్ ప్లాన్ నిధులు దళితులకు ఖర్చు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేష రాములు,శేష ధర్మారావు, శేష లచ్చుము,యస్.దేవదానం,యమ్. సంతోష్,యమ్. సురేష్,యమ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments