👉సస్పెన్షన్ తో వదిలేయకుండా చట్టప్రకారం కేసులు నమోదు చెయ్యాలి
👉సంఘటనను ఖండిస్తున్నాం
👉అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర డిజిటల్ మీడియా కన్వీనర్ తైక్వాండో శ్రీను
ఆంధ్ర పత్రిక-ఆంధ్రప్రేదేశ్:తెలంగాణా రాష్ట్రంలోని యాదాద్రి భూవనగిరి జిల్లాలోని అడ్డగుడూరు పోలీసు స్టేషన్ లో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో పాటు ఇతర సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్స్ ఇండియా మిషన్ రాష్ట్ర డిజిటల్ మీడియా కన్వీనర్ తైక్వాండో శ్రీను డిమాండ్ చేసారు. దళిత మహిళ మరియమ్మను స్టేషన్ లో హింసించి,హతమార్చడం దుర్మార్గమని పేర్కొన్నారు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. మరియమ్మ లాకప్ డెత్ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దొంగతనం చేసిందన్న నెపంతో అర్థరాత్రి ఇంటి వద్ద నుంచి కొట్టుకుంటూ తీసుకువెళ్ళి స్టేషన్ లో కొట్టి దారుణంగా హింసించడం దారుణమని,కుటుంబ సభ్యులు కాళ్ళావేళ్ల బ్రతిమలాడినా కూడా పోలీసులు కనికరించకపోవడం అమానుషమని పేర్కొన్నారు. ఈ లాకప్ డెత్ ఘటనకి బాధ్యులైన ఎస్ .ఐ ,కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసి పోలీసు ఉన్నతాధికారులు చేతుల దులుపుకోవడం సరికాదని ,వారిపై ఎస్ .సి ,ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే బాధిత కుటుంభానికి అన్ని విధాలుగా న్యాయం చేయాలని,ప్రభుత్వం వారికి అండగా నిలవాలని కోరారు. మరియమ్మ మరణం పై సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి లాకప్ మరణాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు.
0 Comments