ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి

ప్రజా పత్రిక-శ్రీకాకుళం:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని రిమ్స్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గురువారము ఉదయం 9గంటలకు రిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా  ఏఐసిసిటియు జిల్లా కన్వీనర్ డి గణేష్, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ జాయింట్ ఏక్షన్ కమిటి జిల్లా కన్వీనర్ దమ్ము సింహాచలం మాట్లాడుతూ గత ఎన్నికలకు జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కనీసం పట్టించుకోకుండా ఉండడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తంచేశారు.ఏపిసిఓ లో పనిచేస్తున్న ఉద్యోగులు అందరికి  11 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని,కోవిడ్ లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 50 లక్షల ఏక్షగ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తాటిపూడి మల్లేష్, వి శంకర్, తులసి రేవతి చిరంజీవమ్మ, కుమారి టి రాజు ,ఏ శంకర్, జ్యోతిప్రసాద్ నర్సునైడు,బి. మాధవరావు,నగేష్ పద్మ, మౌళి, పద్మాకర్ ,యం ప్రభాకర్,టి గోవింద్,ఐ వి లక్ష్మీ, కొనేటి ఈశ్వరమ్మ, మౌనిక, జ్యోతి, పెంటయ్య, గణేష్, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments