ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజాస్వామ్య హక్కుల్ని మోడీ ప్రభుత్వం కాలరాస్తుంది

ప్రజా పత్రిక-శ్రీకాకుళం: మనదేశంలో 1975 జూన్ 25 తేదీ అర్ధరాత్రి అంటే తెల్లవారితే 26వ తేదీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది దేశం యావత్తు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసింది అదేవిధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం  దేశంలో ప్రజాస్వామ్య హక్కుల్ని హరించి వేస్తున్నాడు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులుకు ధారపోస్తూన్నాడు ఈ సందర్భంగా అఖిలభారత కిసాన్ సంఘర్షణ సమితి వ్యవసాయాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అనే నినాదంతో జూన్ 26వ తేదీన జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో పంచాయతీ కార్యాలయం ముందు నిరసన  కార్యక్రమాలు చేయమని పిలుపునిచ్చారు ఈ మేరకు శ్రీకాకుళంలో సిపిఎం కార్యాలయంలో జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ తాండ్ర ప్రకాష్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె. మోహన్ రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిర్లప్రసాద్ గంగారపు సింహాచలం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాద్ ప్రగతిశీల మహిళా సంఘ నాయకురాలు శ్రీమతి కృష్ణ వేణి పాల్గొన్నారు

Post a Comment

0 Comments