ప్రజా పత్రిక: ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని మార్కెట్లలో రసాయనాలతో పండించిన మామిడి పండ్లను బహిరంగ మార్కెట్లో వ్యాపారస్తులు విక్రయాలు జరుపుతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికి ఆహార తనిఖీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. కృత్రిమ రసాయనాలతో పండించిన మామిడి పండ్లను తినడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి ఆహార రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. రసాయనాల వినియోగం వల్ల మామిడి పండ్లు పండక ముందే మార్కెట్లో దించడం వల్ల కొనుగోలుదారులు తినడం వల్ల కొనుగోలుదారులు రోగాలకు పాలవుతున్నారు .రసాయనాల వాడకం వల్ల గుండె,ఉదర శ్వాసకోస వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
0 Comments