ప్రజా పత్రిక-శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం లో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం దక్షిణ కాశిగా పేరొందిన శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రం లో అనధికారంగా ఆలయ ఈఓ తో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విరాళాలు సేకరిస్తు అర్చక కుటుంబీకులకు మోసం చేస్తూ ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్న పెద్ద లింగం అనే మామూలు అర్చకునకు లీగల్ నోటీసులు పంపడం జరిగిందని ప్రధానర్చకులు నాయుడుగారి రాజశేఖర్ తెలిపారు.గత కొద్ది రోజుల నుండి డమ్మీ అర్చక సంఘం ఏర్పాటు చేసి ఆలయ పేరు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు ఎన్నోసార్లు అర్చక పెద్దలు మందలించిన పట్టించుకోలేదన్నారు. అందుకే ఈ లీగల్ నోటీసు పంపవలసి వచ్చిందన్నారు.ఈ నోటీసు స్పందించకపోతే 10 కోట్ల పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
0 Comments