ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మనబడి ని మనమే కాపాడుకుందాం రండి.ఏపీటీఎఫ్

శ్రీకాకుళం:ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూతన విద్యా విధానం మెమో 172 ప్రైవేటు పాఠశాలలకు అనుకూలంగా ఉందని వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు ఉపాధ్యాయులు కేశవరావు,అజాద్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, రాందాస్, సాంబశివరావు, లక్ష్మణరావు, సాంబమూర్తి గోపాలరావు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కి, మండల విద్యాశాఖ అధికారి శాంతారావు కు వినతి పత్రం అందజేశారు. నరసన్నపేట మండల ఏపీటీఎఫ్ అధ్యక్షులు కేశవరావు మాట్లాడుతూ జాతీయ విద్యా విధానానికి అనుగుణముగా రాష్ట్రంలో ప్రాథమిక విద్యా వ్యవస్థ లోని 1 నుంచి 5 తరగతి లోని విడదీస్తున్నారని 1,2 తరగతులు అంగన్వాడీ కేంద్రాల్లో ఒకే చోట ఉంచి వాటిని ప్రీ ప్రైమరీ గా 1,2 తరగతులు మారుస్తున్నారని తెలిపారు. 3 నుంచి 5 తరగతులు మూడు కిలోమీటర్ల దూరంలో హైస్కూల్లో కలుపుతున్నారని 10 సంవత్సరాల లోపు పిల్లలు మూడు కిలోమీటర్ల వెళ్లి చదివే అవకాశం తక్కువ ఉన్నందున వెంటనే ఈ పద్ధతిని రాష్ట్రప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రైవేటు ఇలాగే జరిగితే ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ విద్యార్థుల సంఖ్య పడిపోయి ప్రైవేట్ పాఠశాలలో బాగు పడే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఉందన్నారు. కబడ్డీ వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని యధావిధిగా పాఠశాలకు కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.పాత విద్యా విధానాన్ని కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రైవేటు పాఠశాలలో ప్రోత్సహిస్తున్నట్లు గా ఆవేదన వ్యక్తం చేశారు.మరి మనబడి నాడు నేడు వంటి కార్యక్రమాలు చేసి ఈ విధంగా చేయడం ఎంత వరకు సమంజసం విమర్శించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ఎక్కువ దూరం వెళ్లి విద్యార్థుల చదవలేక చదువు ని పూర్తిగా మానివేసే పరిస్థితులు వస్తాయన్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదని, ప్రైవేటు పాఠశాలలకు మేలు కలిగించే  మెమో  172 వెంటనే రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరించారు. లేనిపక్షంలో మన ఊరి బడి మనమే కాపాడుకుందాం రండి అని పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments