శ్రీకాకుళం: కధానిలయం వ్యవస్థాపకులు, కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత శ్రీ కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలోని స్వగృహంలో గత శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మాన విశాఖ- ఏ కాలనీలో ఉన్న స్వగృహంకి చేరుకొని తొలుత కారా మాస్టారు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్న కథలతో, తనదైన కథా శైలితో ఆకట్టుకున్న ఉత్తరాంధ్రలోని సాహిత్యకారుల్లో ఆయన ప్రముఖుడని ధర్మాన గుర్తు చేశారు. కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఆయన వెంట సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మ రావు, అప్పలనాయుడు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ మామిడి శ్రీకాంత్, డీ. ఈ తిరుమల రావు, కలమట దాసుబాబు, సుంకరి కృష్ణ, చల్లా శ్రీనివాస్ రావు, గానేటి చిన్ని, శంకర్, పూడి జనార్ధన రావు, చోడి గంజి బాలు, పూడి కమల తదితరులు పాల్గోన్నారు
0 Comments