ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చిరంజీవి దర్శిత్ అంటూ ... సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లేఖ

అమరావతి: అమరావతి రైతు ఉద్యమంలో పాల్గొంటున్న దర్శిత్ అనే 17ఏళ్ల కుర్రాడు..సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఇటీవల ఓ లేఖ రాశాడు. ఆ లేఖకు ప్రత్యుత్తరం తాజాగా అందింది. స్వయంగా సుప్రీం సీజేఐ ఈ ఉత్తరాన్ని దర్శిత్‌కు రాశారు.  అతడి ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. రైతు ఉద్యమంలో తనదైన పాత్ర పోషిస్తున్న దర్శిత్.. విద్యార్థిగా ఉంటూనే అమరావతి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ తన గళాన్ని వినిపిస్తున్నాడు. రైతుల పక్షాన నిలబడి పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణకు తెలుగులో దర్శిత్ ఓ లేఖ రాసి పంపాడు. ఈ లేఖకు తాజాగా ప్రత్యుత్తరం అందింది. ఆ ఉత్తరాన్ని సీజేఐ స్వయంగా రాశారు.*
*"చిరంజీవి దర్శిత్"* *అంటూ సంబోధించిన ఆయన.. విద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగాలని, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టు తన లేఖలో పేర్కొన్నారు. తెలుగులో రాసిన లేఖ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. కాగా.. దర్శిత్‌కు చీఫ్ జస్టిస్ కూడా తెలుగులోనే ప్రత్యుత్తరం రాయడం విశేషం.ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాలు కు లింక్స్ లో చూడాలి

Post a Comment

0 Comments