ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లాలో పని చేయడం ఆనందంగా ఉంది.కలెక్టర్ శ్రీనివాస్

శ్రీకాకుళం, జూన్ 7: జిల్లా కలెక్టర్ నివాస్ మంచి సేవలు అందించారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ దంపతులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు సోమవారం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎవ్వరిని నొప్పించకుండా పనులు చేసారని ఆయన పేర్కొన్నారు. 

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లా నుండి వెళ్లడం కష్టంగా ఉందన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించానని చెప్పారు. పనులు చేయుటకు  మార్గదర్శనం చేసామని, లక్ష్యం నిర్దేశించామని ఆయన అన్నారు. టీమ్ వర్క్ గా చేసామని తెలిపారు. సమస్యలు పరిష్కారం కొరకు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించామన్నారు. శ్రీకాకుళం జిల్లా
వెనుకబడిన జిల్లాగా పరిగణించ రాదని అనుకున్నానని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన జిల్లాగా ఉండాలనే తపనతో చేశానని ఆయన చెప్పారు. 
 గ్రీవిన్స్ లో లక్షలాది మందిని చూశామని అయితే జిల్లాలో ఏ ఒక్కరు కూడా  అసభ్యంగా ప్రవర్తించలేదని అది జిల్లా ప్రజల గొప్పదనం అన్నారు. తరువాత కాలంలో గొప్ప అనుభూతి పొందుటకు ప్రతి ఉద్యోగి మంచి సేవలు అందించాలని, అదే గుర్తుగా ఉంటుందని పిలుపునిచ్చారు. కోవిడ్ లో వైద్యులు మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందని, పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పారు. 

పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ జిల్లాకు మంచి సేవలు అందించారని కొనియాడారు. ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ సతీమణి పపితకు కృతజ్ఞతలు తెలిపారు. 

సభకు అధ్యక్షత వహించిన జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాకు ఎనలేని సేవలు అందించారన్నారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమంలోను, కరోనా కట్టడిలోను చక్కటి ప్రణాళికలు రూపొందించారని పేర్కొన్నారు. 

జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ లో చేసిన సేవలు మరువలేనివన్నారు. కష్టపడేతత్వం గొప్పదన్నారు. 

ఐటీడీఏ పిఓ సీ హెచ్.శ్రీధర్ మాట్లాడుతూ పరిధి దాటి ఆలోచించడం, క్షేత్ర స్థాయి సందర్శన, గిరిజన గ్రామాల్లో నీటి ఎద్దడి లేకపోవడానికి 14వ ఆర్ధిక సంఘం నిధులు రూ.22 కోట్లు కారణం, గిరిజనులకు 23 వేల పట్టాలు జారీ చేసారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పారు. 

టెక్కలి సబ్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ గరోడా, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ కృపాకర్ గుండాల, జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, ఇతర జిల్లా అధికారులు మాట్లాడుతూ సేవల్లో గొప్ప స్ఫూర్తిని అందించారన్నారు. అమోఘమైన పనితీరు కనపరిచారన్నారు. ప్రజల కోసం నిరంతర శ్రామికుడుగా సేవలు అందించారని పేర్కొన్నారు. రియల్ లీడర్ అని ప్రశంసించారు. లాక్ డౌన్ సమయంలో వీధి కుక్కలు ఆహారానికి అలమటించకుండా ఆహారాన్ని ఏర్పాటు చేసిన దాయాగుణం కలిగిన వ్యక్తి అన్నారు. సాహిత్యం, కళల పట్ల అభిమానం కలిగిన వారు అని పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలతో సత్కరించారు.

Post a Comment

0 Comments