ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

డయల్ యువర్ కలెక్టర్ కు 25 వినతులు

శ్రీకాకుళం, జూన్ 7 :  డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 25 వినతులు అందాయి. సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పలువురు ఫోన్ కాలర్స్ తమ ఫిర్యాదులను తెలిపారు. కవిటి మండలం ప్రగడపుట్టుగ నుండి పి.ఎ.అప్పలనాయుడు, పలాస మండలం మామిడిపల్లి నుండి యం.కామయ్యలు ఫోన్ చేసి మాట్లాడుతూ తనకు వృద్ధాప్య పింఛను మంజూరుచేయాలని కోరారు. కోటబొమ్మాళి మండలం మాకివలస నుండి సిహెచ్.వీరప్పన్న ఫోన్ చేస్తూ రైతుభరోసా నగదును మంజూరుచేయాలని కోరారు. బూర్జ మండలం జి.పి.ఆర్.పురం నుండి టి.రాంబాబు ఫోన్ చేస్తూ తమ గ్రామంలోని చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఇచ్ఛాపురం వార్డు నెం.16 నుండి జి.భాస్కరరావు మాట్లాడుతూ ఆర్.టి.సి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం ఆక్రమణ చేస్తున్నారని, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సంతకవిటి మండలం కాకరాపల్లి నుండి సర్వే నెం. 41-5లోని 20 సెంట్లు స్థలానికి మ్యూటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. లావేరు మండలం వేణుగోపాలపురం నుండి జి.రామినాయుడు మాట్లాడుతూ కొంతకాలం వరకు అందుతున్న వృద్ధాప్యపు పింఛను నిలుపుదల చేసారని, దానిని మరలా పునరుద్ధరించాలని కోరారు. హిరమండలం మండలం మహాలక్ష్మీపురం నుండి పి.సురేంద్రసాయి మాట్లాడుతూ గతేడాది అమ్మఒడి నగదు అందిందని, కాని ఈ ఏడాది మంజూరుకాలేదని ఫిర్యాదు చేసారు. పొందూరు మండలం నందివాడ నుండి యం.సన్యాసినాయుడు మాట్లాడుతూ తమకు తెలుపు రేషన్ కార్డు ఉన్నప్పటికీ రేషన్ మంజూరుచేయడం లేదని ఫిర్యాదు చేసారు. రాజాం మండం సారధి నుండి వి.రాము ఫోన్ చేసి మాట్లాడుతూ తమ భూమికి చెందిన 1బి అడంగళ్ మంజూరుచేయాలని కోరారు. నందిగాం మండలం యస్.యస్.పురం నుండి యం.మన్మథరావు మాట్లాడుతూ నిలిచిపోయిన తన పింఛనును మరలా పునరుద్ధరించాలని కోరారు. నరసన్నపేట మండలం ఉర్లాం నుండి యన్.గణేష్ మాట్లాడుతూ వై.యస్.ఆర్.జళకల మంజూరుచేయాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం నుండి యన్.రాజశేఖర్ మాట్లాడుతూ శ్రీముఖలింగం దేవాలయ కార్యనిర్వహణ అధికారి విధులకు హాజరుకావడంలేదని ఫిర్యాదు చేసారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని ఎ.జయలక్ష్మీ ఫోన్ చేస్తూ వై.యస్.ఆర్.చేయూత తనకు మంజూరుచేయాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభాగం ( స్పందన ) సిబ్బంది కె.భాస్కరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments