• మాస్క్ వేసుకోకుండా ఉన్నవి 64 వేల కేసులు నమోదు
• పోలీసులు కోవిడ్ భారిన పడినప్పటికీ కర్ఫ్యూ పటిష్టంగా అమలు
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ వెల్లడి
ప్రజా పత్రిక-శ్రీకాకుళం,జూన్,4 : జిల్లాలో కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నివారణకు తీసుకున్న చర్యల్లో భాగంగా కర్ఫ్యూను చాలా పగడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్ తగ్గుముఖం పట్టిందని, కర్ఫ్యూలో సుమారు 23 వేల కేసులు నమోదు చేసామని, మాస్కు వేసుకోకుండా బయటకు వచ్చిన వారిపై సుమారు 64 వేల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతర్రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎవరైనా అనుమతి లేకుండా జిల్లాలోకి వస్తున్నారా లేదా పరిశీలించి పంపుతున్నట్లు చెప్పారు. పోలీసులు కోవిడ్ భారీన పడినప్పటికీ కోవిడ్ నివారణకు కష్టపడి పనిచేశారన్నారు. ఉదయం 5 గంటల నుండి పోలీసులు పనిచేసి రాత్రి సమయంలో కూడళ్లు, మార్కెట్లు, నివాస ప్రాంతాల వద్ద ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమించి రోడ్ల పైకి వస్తే అలాంటి వారితో గౌరవంగా మాట్లాడి ఇంట్లోనే ఉండాలని, కోవిడ్ నివారణకు అందరూ సహకరించాలని పోలీసులు సూచిస్తున్నట్లు చెప్పారు. పోలీసులతో పాటు, వైద్య సిబ్బంది కోవిడ్ నివారణకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తునట్లు తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్ చాలా బాగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే, కోవిడ్ ను నియంత్రణలోకి తీసుకువచ్చి మూడవ దశ రాకుండా అరికట్టవచ్చునని ఆయన కోరారు. అవసరమైతే తప్ప ఎవరూ బయట తిరగవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్ వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగాయానికి సహకరించి జిల్లా నుండి కోవిడ్ ను పారద్రోలుటకు తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని, మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.
0 Comments