ప్రజా-పత్రిక టెక్కలి, జూన్ 11 : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ఆయన చేతుల మీదుగా మూడు చక్రాల సైకిళ్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల తోపాటు అన్ని వర్గాల ప్రజానీకానికి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ పంపిణీ చేసిన 12 ట్రై సైకిళ్లను మండలంలోని అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేపట్టినట్టు ఆయన తెలిపారు .
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ మంచు కరుణాకర్ రావు, ఎంపీడీవో పి నారాయణ మూర్తి, పంచాయతీ కార్యదర్శి బి.శాంతి స్వరూప్ పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు,
0 Comments